ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న రామ్ !
Published on Dec 4, 2017 8:37 am IST

ఈ మధ్యే ‘ఉన్నది ఒకటే జిందగీ’ తో ప్రేక్షకుల్ని పలకరించిన యంగ్ హీరో రామ్ తన తర్వాతి సినిమాకు సిద్ధమవుతున్నారు. నానితో ‘నేను లోకల్’ సినిమా చేసిన దర్శకుడు త్రినాథరావ్ నక్కిన ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ దశలో ఉన్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి మొదలుకానుంది.

తాజా సమాచారం మేరకు పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాలో రామ్ లవర్ బాయ్ గా కనిపించనున్నాడట. అంతేగాక ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడట. అయితే దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాలో ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. రామ్ గత చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ లో కూడా అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి లతో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook