రామ్ పెళ్లి వార్తల్లో వాస్తవం లేదా ?

Published on Jun 27, 2022 3:26 pm IST

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో రామ్ పోతినేని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని తాజాగా ఒక రూమర్ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. రామ్ పోతినేని తన స్కూల్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడని, ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడని ఈ పుకార్లు వినిపిస్తున్నాయి.

పైగా రామ్ ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా అంగీకారం తెలిపాయి అని, రామ్ పోతినేని ఎంగేజ్మెంట్ ఆగస్టు నెలలో జరగనుందని వార్తలు రాస్తున్నారు. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. రామ్ సన్నిహితుల నుంచి కూడా ఈ వార్తకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దేవదాసు సినిమాతో హీరోగా రామ్ అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది వారియర్’ చిత్రంలో పోలీసాఫీసర్‌గా రామ్ నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :