చూస్తా మీకెంత ప్రేముందో నా మీద – రామ జోగయ్య శాస్త్రి

Published on Sep 7, 2021 10:10 pm IST


పాటల రచయిత గా టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న వాళ్ళలో రామ జోగయ్య శాస్త్రి గారు ఒకరు. ఇటీవల కాలంలో మాస్ బీట్స్ కు కారణం అయిన ఈయన తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం లో టైటిల్ సాంగ్ రాశారు. ఈ పాట ఎంతగా ప్రాచుర్యం పొందింది అంటే, యూ ట్యూబ్ లో తెలుగు సిని పరిశ్రమ నుండి ఆల్ టైమ్ రికార్డు కొట్టేసింది.

ఈ పాట కి అతి తక్కువ సమయంలో 1 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ క్రేజ్ కి తగ్గట్లుగా టైటిల్ సాంగ్ ఆప్ట్ అయ్యింది అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రామ జోగయ్య శాస్త్రి తాజాగా ఒక పోస్ట్ చేశారు. రామ జోగయ్య శాస్త్రి గారు తన యూ ట్యూబ్ చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి అంటూ చెప్పుకొచ్చారు. భీమ్లా నాయక్ పాట నచ్చిన వాళ్ళు అంటూ తెలిపారు. చూస్తా మీకెంత ప్రేముందో నా మీద అని అన్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సబ్ స్రైబ్ చేస్తూ స్క్రీన్ షాట్స్ తీసి మరి షేర్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :