మిక్కీ జే మేయర్ అండ్ రాహుల్ ల పై రామజోగయ్య శాస్త్రి వ్యాఖ్యలు!

మిక్కీ జే మేయర్ అండ్ రాహుల్ ల పై రామజోగయ్య శాస్త్రి వ్యాఖ్యలు!

Published on Dec 8, 2021 12:30 PM IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లోతెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం డిసెంబర్ 24 వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి సిరివెన్నెల లిరికల్ వీడియో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన చివరి పాట కావడం తో, ఈ పాటను ఆయనకు అంకితం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే ఈ పాట పై రామ జోగయ్య శాస్త్రి గారి స్పందిస్తూ, మిక్కీ జే మేయర్ మరియు రాహుల్ సంకృత్యాన్ లు, మీరు ఆశీర్వదించబడ్డారు అంటూ చెప్పుకొచ్చారు. అందుకు దర్శకులు స్పందిస్తూ, నమస్కారం పెట్టడం జరిగింది. నాని హీరోగా వస్తున్న ఈ సినిమా లో మునుపెన్నడూ లేని విధంగా మేకోవర్ అయ్యారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు