క్యూట్ అండ్ కలర్ ఫుల్ గా “రామారావు ఆన్ డ్యూటీ” ఫస్ట్ సింగిల్.!

Published on Apr 10, 2022 11:10 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రస్తుతం చేస్తున్న పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో నూతన దర్శకుడు శరత్ మందవ తో చేస్తున్న సాలిడ్ మాస్ అండ్ సోషల్ డ్రామా “రామారావు ఆన్ డ్యూటీ” కూడా ఒకటి. మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈరోజు రామ నవమి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘బుల్ బుల్ తరంగ్’ ని రిలీజ్ చేశారు. అయితే ఇది ఫస్ట్ టైం వినడంలోనే ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి.

సిద్ శ్రీరామ్ గాత్రంలో అలాగే విజువల్ గా ఈ సాంగ్ మంచి క్యూట్ అండ్ కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. అలాగే హీరోయిన్ మరియు రవితేజ లుక్స్ గాని మంచి యంగ్ గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సామ్ సి ఎస్ నుంచి ఫస్ట్ సాంగ్ ఈ సినిమా నుంచి మంచి హిట్ ట్రాక్ అందించాడని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం వచ్చే జూన్ 17న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :