ట్రైలర్ టాక్ : రామ్ ది ‘వారియర్’….టెర్రిఫిక్ & పవర్ఫుల్

ట్రైలర్ టాక్ : రామ్ ది ‘వారియర్’….టెర్రిఫిక్ & పవర్ఫుల్

Published on Jul 1, 2022 9:01 PM IST

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరక్కిన భారీ ద్విభాషా మూవీ ది వారియర్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో శ్రీనివాస చిట్టూరి తీసిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందించగా యువ భామ కృతి శెట్టి ఇందులో రామ్ కి జోడీగా నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్ లో అదరగొట్టగా, నేడు కొద్దిసేపటి క్రితం థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది యూనిట్. నేడు అనంతపూర్ లో జరిగిన వేడుకలో బోయపాటి శ్రీను, శివ కార్తికేయన్ కలిసి ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

‘ఒక చెట్టు మీద నలభై పావురాలు ఉన్నాయి, అందులో ఒకపావురాన్ని కాలిస్తే ఎన్ని ఉంటాయి అంటూ హీరో రామ్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో మొదలయ్యే ది వారియర్ ట్రైలర్, ఒంటి మీద యూనిఫార్మ్ లేకపోయినా రౌండ్ ద క్లాక్ డ్యూటీ లో ఉంటాను, ఈఊరికి పట్టిన రోగం వేరు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు ఆపరేషన్ స్టార్ట్స్ అంటూ ట్రైలర్ లో హీరో రామ్ పలికే డైలాగ్స్ అదిరిపోయాయి. వీటితో పాటు యాక్షన్ సీన్స్, ఫైట్స్, విలన్ గా నటించిన ఆది పెర్ఫార్మన్స్, సహా అన్ని ఎంతో పవర్ఫుల్ గా ఉన్నాయి. ఇక విజువల్స్, బీజీఎమ్, హీరోయిన్ కృతి శెట్టి అందం వెరసి ది వారియర్ ట్రైలర్ టెర్రిఫిక్ గా రూపొంది అందరిలో మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది అనే చెప్పాలి. కాగా ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో జులై 14న రిలీజ్ చేయనున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు