డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన “రామబాణం”

Published on Sep 7, 2023 11:00 am IST


టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ రామబాణం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు. అయితే ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం సెప్టెంబర్ 14, 2023 న ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డింపుల్ హాయాతి లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :