ఓటిటి లోకి వచ్చేసిన “రామబాణం”

Published on Sep 14, 2023 5:39 pm IST

టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ రామబాణం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఓటిటి లోకి అడుగు పెట్టింది.

థియేటర్ల లో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలం అయిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ చిత్రం లో డింపుల్ హాయాతి హీరోయిన్ గా నటించగా, విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :