నా వయసు పెంచేస్తున్నాడు…థమన్ పై రామజోగయ్య శాస్త్రి కీలక వ్యాఖ్యలు!

Published on Jan 16, 2022 11:08 pm IST


తెలుగు సినీ పరిశ్రమలో రచయిత గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ లో రామజోగయ్య శాస్త్రి గారు ఒకరు. పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి గారు పాటలు రాసిన సంగతి అందరికీ తెలిసిందే. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి పాటలు రాయడం, అవి కాస్త సెన్సేషన్ సృష్టించిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా సంగీత దర్శకులు తమన్ రామజోగయ్య శాస్త్రి గురించి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గురించి చాలా చెప్పాలి, కానీ కొన్ని మాత్రమే చెప్తా అన్నారు. రామజోగయ్య శాస్త్రి గారు తన తండ్రి లాంటి వారు అని, సంగీతాన్ని అతను డిఫైన్ చేసే విధానం, ఎంజాయ్ చేయడం అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు భీమ్లా నాయక్ కోసం చాలా కష్టపడ్డారు అని అన్నారు. అయితే థమన్ వ్యాఖ్యలకు గానూ, రామజోగయ్య శాస్త్రి స్పందిస్తూ, నా వయసు పెంచేస్తున్నాడు, కాపాడండి ఎవరైనా అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :