ఫైనల్ షెడ్యూల్‌కు రామారావు ఆన్ డ్యూటీ..!

Published on Oct 13, 2021 2:19 am IST


మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ చేస్తున్నాడు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ జరుపుకునేందుకు సిద్దమయ్యింది. ఈ షెడ్యూల్‌లో ఇండియాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తారు. అలాగే యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో పాటలు చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో వేణు కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

సంబంధిత సమాచారం :