క్లీన్ అండ్ హాట్ గా “రామారావు ఆన్ డ్యూటీ” నుంచి సీసా సాంగ్.!

Published on Jul 2, 2022 11:50 am IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ చిత్రాల్లో నూతన దర్శకుడు శరత్ మందవ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ అండ్ సోషల్ సబ్జెక్ట్ “రామారావు ఆన్ డ్యూటీ”. మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి మేకర్స్ ఒకో అప్డేట్ ని రిలీజ్ చేస్తుండగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఐటెం నెంబర్ “నా పేరు సీసా” అనే సాంగ్ ని రిలీజ్ చేశారు.

మరి ఈ సాంగ్ మాత్రం ఇతర సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి చాలా భిన్నంగా ఉందని చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ సాంగ్ కి సామ్ సి ఎస్ చాలా క్లీన్ బీట్స్ అందించగా చంద్రబోస్ సాహిత్యం మరింత ఆసక్తిగా ఉందని చెప్పాలి. అలాగే శ్రేయ ఘోషల్ గొంతుతో మరింత గ’మ్మత్తు’ గా అనిపించిన ఈ సాంగ్ లో అన్వేషి జైన్ గ్లామ్ షో తో హాట్ కూడా కనిపించింది.

ఇంకా ఈ సాంగ్ లో రవితేజ లుక్స్ తో అయితే మరింత యంగ్ గా కనిపించడం ఆసక్తిగా ఉంది. ఇలా ఓవరాల్ గా అయితే ఈ సాంగ్ మాత్రం మంచి క్లీన్ అండ్ హాట్ గా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఎస్ ఎల్ వి సినిమాస్ వారు మరి రవితేజ ప్రొడక్షన్ హౌస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించగా ఈ జూలై 29న థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :