సాలిడ్ స్కోర్ తో హార్డ్ హిట్టింగ్ గా “రామారావు” మాస్ నోటిస్.!

Published on Jul 27, 2022 12:41 pm IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ చిత్రాల్లో దర్శకుడు శరత్ మండవ కి టాలీవుడ్ లో కొత్త దర్శకునిగా ఛాన్స్ ఇచ్చి చేసిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”. మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఆల్రెడీ మంచి ప్రమోషన్స్ ని చేస్తుండగా మేకర్స్ ఈ సినిమాపై హైప్ ని మరింత పెంచేందుకు ఒక మాస్ నోటిస్ అంటూ ఇంట్రెస్టింగ్ వీడియో ని ఇప్పుడు రిలీజ్ చేశారు.

మరి ఇది మాత్రం మాంచి హార్డ్ హిట్టింగ్ గా ఉందని చెప్పాలి. సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఇంట్రెస్టింగ్ విజువల్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ లేటెస్ట్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతుంది. అంతే కాకుండా లాస్ట్ లో రవితేజ మార్క్ పంచ్ డైలాగ్ కూడా పేలింది. మొత్తానికి అయితే ఈ వీడియో ఓ రేంజ్ లో ఉంది. మరి సినిమా అయితే ఎలా ఉంటుందో చూడాల్సిందే. దాని కోసం ఈ జూలై 29వరకు ఆగాలి మరి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :