రవితేజ ఆన్ ఫైర్…టాప్ లో ట్రెండ్ అవుతోన్న “రామారావు ఆన్ డ్యూటీ” టీజర్!

Published on Mar 2, 2022 10:30 am IST

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. SLV సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు RT టీమ్ వర్క్స్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను ప్రకటించిన అనంతరం నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా కి సంబందించిన ప్రచార చిత్రాలు సైతం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ టీజర్ కి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో సైతం భారీ వ్యూస్ తో టాప్ లో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ ఈ టీజర్ కి 4.3 మిలియన్ వ్యూస్ రాగా, 233కే లైక్స్ రావడం విశేషం. రవితేజ ఫుల్ ఫైర్ తో దూసుకు పోతున్నట్లు టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ ను చూస్తే అర్ధం అవుతుంది. దివ్యాంశ కౌశిక్, రజిష విజయన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం లో వేణు తొట్టెంపూడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాజర్, సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్, తనికెళ్ళ భరణి, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :