వైరల్ : “రాధే శ్యామ్” తో ‘రామారావు’ టీజర్..అదిరే రెస్పాన్స్.!

Published on Mar 11, 2022 1:00 pm IST

ఈరోజు ఎన్నో అంచనాలు నడుమ భారీ స్థాయిలో రిలీజ్ అయ్యిన మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్”. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఫైనల్ గా థియేటర్స్ లో వచ్చేసరికి అభిమానులు భారీ రెస్పాన్స్ తో థియేటర్స్ లో మాస్ సెలబ్రేషన్స్ ని చేస్తున్నారు. మరి ఈ సినిమాతో పాటుగా మాస్ మహారాజ రవితేజ అభిమానులకి కూడా సాలిడ్ ట్రీట్ థియేటర్స్ లో దొరికినట్టు తెలుస్తుంది.

లేటెస్ట్ గా రవితేజ నటించిన ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గా దర్శకుడు శరత్ మందవ తెరకెక్కించిన చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”. మరి ఈ టీజర్ ని రాధే శ్యామ్ కి ముందు ప్లే చెయ్యగా థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ కూడా అంతా ఇంత కాదు. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రభాస్ మరియు రవితేజ అభిమానుల నడుమ మంచి వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుంది.

సంబంధిత సమాచారం :