Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ పై రామాయణ నిర్మాత క్లారిటీ

ఇండియన్ సినిమా నుంచి వచ్చిన పలు క్రేజీ విజువల్ వండర్ చిత్రాల్లో బాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన భారీ విజువల్ ట్రీట్ చిత్రం “బ్రహ్మాస్త్ర” కూడా ఒకటి. రణబీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ అస్త్రవర్స్ మొదటి సినిమా ఆడియెన్స్ ని అలరించింది.

అయితే దీనికి పార్ట్ 2 కోసం మాత్రం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ గ్యాప్ లోనే అయాన్ వార్ 2 చేయడం హీరో రణబీర్ అనిమల్ మరియు రామాయణ చేస్తుండడంతో బ్రహ్మాస్త్ర 2 చాలా వెనక్కి వెళ్ళింది. ఇక ఈ సినిమాకి పార్ట్ 2 పై నిర్మాత నమిత మల్హోత్రా ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చారు.

లేటెస్ట్ సినిమాకాన్ ఈవెంట్ లో పాల్గొన్న తను తమ రామాయణం తో పాటుగా బ్రహ్మాస్త్ర 2 కూడా వస్తుందని ఖరారు చేశారు. రామాయణ తర్వాత తమ మలి ప్రాజెక్ట్ బ్రహ్మాస్త్ర 2 నే అని తాను తెలిపారు. సో బ్రహ్మాస్త్ర ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక తెలుగులో బ్రహ్మాస్త్రం పేరిట విడుదల అయ్యిన ఈ సినిమా మన దగ్గర కూడా మంచి వసూళ్లు రాబట్టింది.

Exit mobile version