ఆ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న రంభ !

Published on Apr 17, 2022 6:34 pm IST

సీనియర్ సౌత్ హీరోయిన్ రంభ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బిజినెస్‌మ్యాన్ ఇంద్రకుమార్ ను రంభ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, చాలా గ్యాప్ తర్వాత కార్తి హీరోగా రాబోతున్న ‘సర్దార్’ సినిమా ద్వారా మళ్లీ వెండితెర పైకి ఎంట్రీ ఇస్తోంది ఈ మాజీ హీరోయిన్. ‘సర్దార్’ను పిఎస్. మిత్రన్ తెరకెక్కిస్తున్నాడు. ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది.

అన్నట్టు ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. రంభకి ఇటు తెలుగులో పాటు అటు తమిళంలో కూడా మంచి గుర్తింపు ఉంది. బోల్డ్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ లా ఉండే రంభకి ఇప్పటికీ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలోనూ ఆమెకు ఛాన్స్ వచ్చింది అని టాక్ నడుస్తోంది. ఇక రంభ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.

సంబంధిత సమాచారం :