మరో సాలిడ్ రికార్డు అందుకున్న చరణ్ క్రేజ్.!

Published on Feb 8, 2023 2:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మావెరిక్ దర్శకుడు శంకర్ తో తన కెరీర్ లో 15వ సినిమాని అయితే సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా కన్నా ముందు చేసిన తన “రౌద్రం రణం రుధిరం” చిత్రంతో భారీ క్రేజ్ ని గ్లోబల్ గా కూడా తాను సొంతం చేసుకున్నాడు.

మరి ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో అయితే చరణ్ తన ఫాలోయింగ్ ని మాత్రం అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తుండగా తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో అయితే తాను ఇప్పుడు 12 మిలియన్ ఫాలోవర్స్ ని తాను సొంతం చేసుకున్నాడు. దీనితో టాలీవుడ్ నుంచి అతి తక్కువ సమయంలో 12 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న హీరోగా చరణ్ నిలిచాడు. ఇక ప్రస్తుతం చరణ్ చిన్న బ్రేక్ లో ఉండగా దీని తర్వాత శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.

సంబంధిత సమాచారం :