గెట్ రెడీ.. రేపే ఆచార్య ‘సిద్ధ’ టీజర్..!

Published on Nov 27, 2021 8:56 pm IST


మెగస్టార్ చిరంజీవి హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఆచార్య”. ఈ సినిమాలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా సిద్ద అనే కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో రామ్‌చరణ్ లుక్స్ ని మాత్రమే చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే రేపు చెర్రీని ‘సిద్ధ’గా పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేయనుంది.

నవంబర్ 28న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు సిద్ధ టీజర్ విడుదల చేస్తున్నట్టు తెలిపిన చిత్ర బృందం ఈ మేరకు ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :