షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ ‘హైపర్’

hyper-ram-press
‘నేను శైలజ’తో సూపర్ హిట్ కొట్టిన రామ్, తాజాగా ‘హైపర్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వస్తోన్న విషయం తెలిసిందే. గత పదిరోజులుగా జార్జియాలో పాటల షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా నేటితో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. జార్జియా షెడ్యూల్‍తో సినిమా షూటింగ్ మొత్తం పక్కాగా పూర్తైందని టీమ్ తెలిపింది. ఇప్పటికే మొదలైన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి సెప్టెంబర్ 30న, ముందే ప్రకటించినట్లుగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని టీమ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

రామ్‌కు ‘కందిరీగ’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా, రామ్ స్టైల్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం పొందుతోంది. గిబ్రాస్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో వచ్చే వారమే విడుదల కానుంది. రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.