రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రామ్ కొత్త చిత్రం!
Published on Sep 26, 2017 12:11 pm IST


ఎనర్జిటిక్ హీరో రామ్ చేస్తున్న తాజా చిత్రం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’. ఫస్ట్ లుక్, ఆడియో సింగిల్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఆఖరి దశలో పనుల్లో ఉంది. ‘నేను శైలజ’ వంటి హిట్ తర్వాత కిశోర్ తిరుమల, రామ్ లు కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అందరిలోనూ పాజిటివ్ అభిప్రాయమే ఉంది. ఇకపోతే ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 27న రిలీజ్ చేయనున్నారు.

రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. స్నేహం, ప్రేమల నైపథ్యంలో సాగే ఈ సినిమాను స్రవంతి సినిమాటిక్ పతాకంపై కృష్ణ చైతన్య నిర్మిస్తున్నారు. ఇటలీ, మిలాన్ వంటి ఫెమస్ లొకేషన్లలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 
Like us on Facebook