నాని దర్శకుడితో రామ్ సినిమా ?
Published on Oct 29, 2017 10:58 am IST


యంగ్ హీరో రామ్ పోతినేని తాజా చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ గత శుక్రవారం విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ యంగ్ హీరో రెట్టించిన ఉత్సాహంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై తన పనుల్ని వేగవంతం చేశారు. సినీ వర్గాల్లో వినిస్తున్న టాక్ ప్రకారం ఇప్పటికే పలు స్క్రిప్ట్స్ ను రామ్ త్రినాథ్ రావ్ నక్కిన చెప్పిన కథను ఓకే చేశారని తెలుస్తోంది.

‘హైపర్’ తర్వాత నుండి కొత్తదనమున్న పాత్రల్ని, కథలని వెతుకుతున్న రామ్ కు త్రినాథ్ రావ్ చెప్పిన స్క్రిప్ట్ భిన్నంగా అనిపించడంతో ఓకే చేశారట. అన్నీ కుదిరితే ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కే ఛాన్సుంది. అయితే ఈ విషయంపై రామ్ నుండి కానీ త్రినాథ్ రావ్ నుండి కానీ ఇంకా ఎలాంటి సమాచారమూ అందలేదు. త్రినాథ్ రావ్ నక్కిన గతంలో నానితో ‘నేను లోకల్’ అనే సినిమా చేసి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook