
‘మసాలా’ సినిమా తర్వాత ఒక ఏడాది గ్యాప్ తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసిన సినిమా ‘పండగ చేస్కో’. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాని మే 29న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. అందులో భాగంగా ఈ రోజు ఈ చిత్ర టీం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ మే 29 అని ఈ చిత్ర నిర్మాతలు మరోసారి ఖరారు చేసారు.
రామ్ ఈ సినిమాలో ఓ ఎన్నారై కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు. గ్యాప్ తీసుకొని చేసిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని రామ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. తమన్ మ్యూజిక్ ఆల్బమ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ట్రైలర్ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ జోడీ కట్టారు. ఈ సినిమాలో బ్రహ్మానందం చేసిన వీకెండ్ వెంకట్ పాత్ర ఆధ్యంతం ప్రేక్షకులను నవ్విస్తుందని అంటున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ‘పండగ చేస్కో’ను నిర్మించారు.