రామ్ “స్కంద” అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

Published on Sep 24, 2023 9:22 pm IST


టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. రామ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడం తో సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా కి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిన కొద్ది సేపటికే టికెట్స్ భారీగా సోల్డ్ అవుతున్నాయి. ఈ చిత్రం లో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 28, 2023 న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :