రామ్ “ది వారియర్” మ్యాజిక్‌ను రీ క్రియేట్ చేస్తుందా?

రామ్ “ది వారియర్” మ్యాజిక్‌ను రీ క్రియేట్ చేస్తుందా?

Published on Nov 20, 2022 6:13 PM IST

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ది వారియర్ మొదటి టెలికాస్ట్‌లో 10.02 టిఆర్‌పిని నమోదు చేసింది. ఇప్పుడు, లింగుసామి దర్శకత్వం వహించిన ది వారియర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా హిందీలో ప్రసారం కానుంది. ప్రముఖ హిందీ ఛానల్ కలర్స్ సినీప్లెక్స్ ఈరోజు రాత్రి 8 గంటలకు వారియర్ హిందీ వెర్షన్‌ను ప్రసారం చేస్తుంది.

హిందీలో కూడా టీఆర్పీ రేటింగ్స్ భారీగానే ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమాని నార్త్ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించిన ఈ యాక్షన్ డ్రామాలో కృతి శెట్టి కథానాయిక గా నటించింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు