‘రాములో రాములా’.. ఇరగదీసిందిరో

ramulo

ఒక సినిమా పాటలు ప్రేక్షకులకి ఎంత బాగా నచ్చితే ఆ సినిమా మీద హైప్, పాజిటివ్ బజ్ అంత బాగా పెరుగుతాయనడానికి ‘అల వైకుంఠపురములో’ పాటలే నిదర్శనం. ఈ సినిమా నుండి వచ్చిన మొదటి పాట ‘సామజవరగమన’ 97 మిలియన్ల వ్యూస్, మిలియన్ లైక్స్ సాధించి రికార్డ్స్ నెలకొల్పగా రెండో పాట ‘రాములో రాములా’ కూడా అదే స్థాయిలో ఆదరణ దక్కించుకుంది.

విడుదలైన నెల రోజుల్లోనే ఈ పాట 73 మిలియన్ల వ్యూస్, 7 లక్షలకు పైగా లైక్స్ సాధించి సెకండ్ మోస్ట్ లైక్డ్ తెలుగు సాంగ్ అనే ఘనతను అందుకుంది. అలాగే మూడో పాట ‘ఓ మైగాడ్ డాడీ’ కూడా శ్రోతల్ని బాగానే అలరిస్తోంది. మొత్తానికి మూడు పాటలతో సినిమా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ పాటల విజయంతో చిత్ర సంగీత దర్శకుడు తమన్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరి 12న ప్రేక్షకులకు అందివ్వనున్నారు.

Exit mobile version