‘గాడ్‌ఫాదర్’లో మెగాస్టార్ చెల్లెలిగా రమ్యకృష్ణ?

Published on Nov 17, 2021 12:21 am IST


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వీటిలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ “గాడ్ ఫాదర్” సినిమా మోస్త్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా ఎవరు కనిపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్‌లో మోహన్ లాల్ చెల్లెలిగా మంజు వారియర్ సందడి చేసింది. అయితే గాడ్ ఫాదర్‌లో చిరు చెల్లెలిగా నయనతార నటిస్తుందని తొలుత వార్తలు వినిపించాయి. ఆ తర్వాత నయనతార ప్లేస్‌ని శోభన రీప్లేస్ చేసిందని ప్రచారం జరిగింది. కానీ తాజాగా వీరిద్దరూ కాకుండా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ చిరుకి చెల్లెలిగా మెరవబోతుందని టాక్ నడుస్తుంది. అయితే ఈ వార్తల్లో మాత్రం మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :