మరో భారీ బడ్జెట్ చిత్రంలో ‘రమ్యకృష్ణ’ స్పెషల్ రోల్

ramyakrishna-in-jagur
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలు, స్టార్ దర్శకులందరితో పనిచేసిన నటి ‘రమ్య కృష్ణ’ ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ముందుకెళుతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో ‘శివగామి’ పాత్రలో ఈమె నటనకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. దీంతో భారీ బడ్జెట్ చిత్రాల్లో ఈమెకు స్పెషల్ రోల్స్ అవకాశాలు వెల్లువెత్తున్నాయి.

తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు ‘నిఖిల్’ హీరోగా పరిచయమవుతున్న ‘జాగ్వర్’ చిత్రంలో ఈమె ఓ స్పెషల్ రోల్ చేస్తోంది. సినిమాలో ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని కూడా తెలుస్తోంది. ‘మహాదేవ్’ దర్శకత్వం వహిస్తున్న ఈ రూ.75 కోట్ల భారీ బడ్జెట్ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు.