టీజర్ టాక్..”రానా నాయుడు” నుంచి వెంకీ – రాణా ల యాక్షన్ విధ్వసం.!

Published on Sep 24, 2022 1:06 pm IST

గత కొన్నాళ్ల కితమే దిగ్గజ ఓటిటి సంస్థ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ తో దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ల తో “రానా నాయుడు” అనే ఫస్ట్ ఫిల్మ్ ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి అప్పట్లో దీనిపై సాదా సీదా అంచనాలే ఉండి ఉండొచ్చు ఏమో కానీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వారు రిలీజ్ చేసిన టీజర్ తర్వాత అయితే అంచనాలు ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాయని చెప్పాలి.

పూర్తిగా హిందీలోనే డిజైన్ చేసిన ఈ చిత్రం నుంచి వచ్చిన ఈ టీజర్ సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో కనిపిస్తుంది. ఇక రానా నుంచి అయితే బీస్ట్ మోడ్ కనిపిస్తుంది, అలాగే తనలోని యాంగర్ లెవెల్ ఎలా ఉంటుందో కూడా ఈ సినిమాలో తాను స్టన్నింగ్ లెవెల్లో చూపించాడు.

ఇక విక్టరీ వెంకటేష్ నుంచి కూడా మేకోవర్ ఆశ్చర్యపరిచింది. ఇంకా రానా మరియు తనకి ఉన్న సన్నివేశాలు అయితే భారీ ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ ఇద్దరి నుంచి సాలిడ్ యాక్షన్ విధ్వంసమే ప్రామిస్ చేస్తున్నారు. ఈ చిత్రం అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :