రానా, వెంకటేష్ ల ‘రానా నాయుడు’ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్

Published on Feb 16, 2023 8:02 am IST

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి తొలిసారిగా కలిసి నటించిన తాజా వెబ్ సిరీస్ షో రానా నాయుడు. యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ సిరీస్ గా రూపొందిన రానా నాయుడులో టైటిల్ రోల్ లో రానా నటిస్తుండగా నాగ పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. ఇక ఈ సిరీస్ లో తండ్రి కొడుకులుగా నటిస్తున్న ఈ ఇద్దరూ కూడా ట్రైలర్ లో అదరగొట్టే పెర్ఫార్మన్స్ ని కనబరిచారు. దీన్ని సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించగా కరణ్ అన్షుమాన్ దీన్ని రూపొందించారు.

కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ట్రైలర్ లో ఆకట్టుకునే యాక్షన్ అంశాలు, డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ఇక ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కి అన్ని భాషల్లో కూడా సూపర్ గా రెస్పాన్స్ లభిస్తోంది. మార్చి 10న ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా పలు భాషల్లో రిలీజ్ కానున్న ఈ వెబ్ సిరీస్ తప్పకుండా ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :