సందీప్ “మైఖేల్” టీమ్ కి రానా బెస్ట్ విషెస్!

Published on Feb 2, 2023 11:00 pm IST


సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జేయకోడి దర్శకత్వం లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మైఖేల్. ఈ చిత్రం లో దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ మేరకు స్టార్ హీరో రానా దగ్గుపాటి సోషల్ మీడియా వేదిక గా చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపారు.

ఇప్పటి వరకు ఇది నీ బెస్ట్ సందీప్ కిషన్ అంటూ చెప్పుకొచ్చారు రానా. డైరెక్టర్ రంజిత్ జయకొడి కి మరియు కాస్ట్ అండ్ క్రూ కి బెస్ట్ విషెస్ తెలిపారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో అనసూయ భరద్వాజ్, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :