కష్టమైన, భిన్నమైన కథను చాలా సులభంగా మరియు గొప్పగా చెప్పబడింది – రానా దగ్గుపాటి!

Published on Oct 3, 2021 2:50 pm IST


ఆకాశవాణి చిత్రం పై టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా దగ్గుపాటి కీలక వ్యాఖ్యలు చేశారు. అశ్విన్ గంగరాజు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మేరకు రానా దగ్గుపాటి ఈ చిత్రం పై ప్రశంశల వర్షం కురిపించారు. అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించిన ఆకాశవాణి చిత్రం ను చూసినట్లు తెలిపారు. చాలా భిన్నమైన మరియు కష్టమైన కథను చాలా సులభంగా మరియు గొప్ప నైపుణ్యంగా చెప్పబడింది అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం గొప్ప విజయం సాధించినందుకు అశ్విన్ కి మరియు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు రానా దగ్గుపాటి చేసిన వ్యాఖ్యల పట్ల దర్శకుడు అశ్విన్ గంగరాజు స్పందించారు. ఇది చూసి ఆనందం తో గంతులు వేసింది, ధన్యవాదాలు సర్ అంటూ చెప్పుకొచ్చారు. మీరు చూపిస్తున్న నిరంతర ప్రేమ, ప్రోత్సాహం నా లిమిట్స్ ను అధిగమించ డానికి మరియు ఇంకా బాగా చేయడానికి ఒక అపరిమితమైన శక్తిని ఇస్తుంది అని అన్నారు. ఈ చిత్రం లో సముద్రఖని కీలక పాత్ర లో నటించారు.

సంబంధిత సమాచారం :