సుధీర్ బాబు “హంట్” టీజర్ పై రానా కామెంట్స్!

Published on Oct 4, 2022 3:54 pm IST

సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా హంట్. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా, దానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచిందని చెప్పాలి. అయితే తాజాగా పాన్ ఇండియా నటుడు రానా దగ్గుపాటి టీజర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చూడటానికి చాలా కూల్ గా ఉంది, గుడ్ లక్ అంటూ చెప్పుకొచ్చారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :