శ్రీ విష్ణు “అర్జున ఫల్గుణ” ఊర మాస్ రోల్ పై రానా దగ్గుపాటి అద్దిరిపొయే కామెంట్స్!

Published on Nov 9, 2021 3:40 pm IST


డిఫెరెంట్ స్టోరీస్ తొ డిఫెరెంట్ పాత్ర లతో ప్రతిసారీ అలరిస్తున్న శ్రీ విష్ణు మరొకసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి కూడా డిఫెరెంట్ గా, ఊర మాస్ గెటప్ లో వస్తున్నారు శ్రీ విష్ణు. శ్రీ విష్ణు హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అర్జున ఫల్గుణ. తేజ మర్ని దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ తాజాగా విడుదల అయ్యింది. ఈ టీజర్ విడుదల అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

శ్రీ విష్ణు ఊర మాస్ రోల్ లో ఆకట్టుకున్నారు. అయితే విడుదల అయిన ఈ టీజర్ పై ప్రముఖ టాలివుడ్ నటుడు రానా దగ్గుపాటి కీలక వ్యాఖ్యలు చేశారు. అద్దిరి పోయింది గా, న్యూ వెరైటీ కి సెల్యూట్ అంటూ చెప్పుకొచ్చారు. రానా దగ్గుపాటి చేసిన వ్యాఖ్యల తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఈ చిత్రం లో శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తుండగా, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవి ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ కాశి రెడ్డి, చైతన్య గరికిపాటి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియదర్శన్ బాల సుబ్రహ్మణ్యన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తేజ మర్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :

More