అన్‌స్టాపబుల్: భళ్లాలదేవుడితో సందడి చేయబోతున్న బాలయ్య..!

Published on Jan 1, 2022 11:09 pm IST

నందమూరి బాలకృష్ణ ఆహాలో వచ్చే “అన్‌స్టాపబుల్” షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్లతో బాలయ్య చేస్తున్న సందడి ప్రేక్షకులకు ఫుల్ టూ ఎంటర్‌టైన్‌ని ఇస్తుంది. అయితే మహేష్ బాబు ఎపిసోడ్ తో ఈ సీజన్‌ని ముగిస్తున్నామని ఇప్పటికే ఆహా అనౌన్స్ చేయగా, మహేశ్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా రానుంది.

అయితే ఇటీవల 7వ ఎపిసోడ్‌లో భాగంగా మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి రచ్చ చేసిన బాలయ్య 8వ ఎపిసోడ్‌లో భళ్లాలదేవ రానా దగ్గుబాటితో సందడి చేయబోతున్నాడు. ఈ ఎపిసోడ్ జనవరి 7న స్ట్రీమింగ్ కానుందని ఆహా ప్రకటిస్తూ సెట్‌లో ఉన్న బాలయ్య, రానాల ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. మరి రానాను బాలయ్య ఏ విధంగా ఆడుకుంటాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :