అభిమానులకి రానా నుంచి సాలిడ్ ప్రామిస్.!

Published on Jun 16, 2022 8:00 am IST


మన టాలీవుడ్ హల్క్ హీరో రానా దగ్గుబాటి హీరోగా ప్రస్తుతం దర్శకుడు వేణు ఉడుగుల తో చేసిన చిత్రం “విరాట పర్వం” కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం రేపు విడుదలకి సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం మేకర్స్ నిన్ననే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ..

తమ అభిమానులకి ఒక సాలిడ్ ప్రామిస్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. తాను ఇప్పటి వరకు ప్రయోగాలు చేశాను. అది ఈ సినిమాతోనే లాస్ట్ అని ఇక నుంచి అన్నీ ఫ్యాన్స్ ఇష్టపడే నచ్చే సినిమాలు చేస్తానని రానా ప్రామిస్ ఇచ్చాడు. దీనితో ఈ ప్రామిస్ తో దగ్గుబాటి ఫాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ నుంచి రానా సైడ్ పలు సాలిడ్ మాస్ ఫిల్మ్స్ ఏమన్నా వస్తాయేమో చూడాలి.

సంబంధిత సమాచారం :