“కేజీయఫ్ 2” యూనిట్ పై టాలీవుడ్ హల్క్ స్పెషల్ అప్లాజ్.!

Published on Apr 17, 2022 9:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర ఓ రేంజ్ లో సెన్సేషన్ ని నమోదు చేస్తున్న లేటెస్ట్ భారీ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక అన్ని సినీ వర్గాల నుంచి మరియు ప్రముఖులు నుంచి ప్రశంసలు అందుతుండగా..

లేటెస్ట్ గా మన టాలీవుడ్ హల్క్ హీరో రానా దగ్గుబాటి తన స్పెషల్ అప్లాజ్ ని చిత్ర యూనిట్ కి అందించాడు. ఇద్దరు వైల్డ్ మెన్ యష్ మళ్ళీ అదరగొట్టాడని అలాగే ప్రశాంత్ నీల్ వర్క్ కి వెల్డన్ చెబుతూ ఈ సినిమా విజయం అందుకున్నందుకు కేజీయఫ్ చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పాడు. దీనితో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. రీసెంట్ గా రానా నటించిన భీమ్లా నాయక్ తో మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :