‘కేజీఎఫ్’ భామ‌తో రానా రొమాన్స్..?

‘కేజీఎఫ్’ భామ‌తో రానా రొమాన్స్..?

Published on Jun 24, 2024 3:00 PM IST

టాలీవుడ్ హ‌ల్క్ రానా ద‌గ్గుబాటి ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ త‌రువాత కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్ప‌టికే ఆయ‌న త‌న నెక్ట్స్ సినిమాల‌ను అనౌన్స్ చేసినా, అవి ప‌ట్టాలెక్క‌క‌పోవ‌డంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌కత్వంలో ‘రాక్ష‌స రాజు’ అనే సినిమాను అనౌన్స్ చేసిన రానా, ఆ సినిమా షూటింగ్ ను ఇంకా స్టార్ట్ చేయ‌లేదు. గ‌తంలో ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ తో క‌లిసి ‘హిరణ్యకశ్యప’ను ప్ర‌క‌టించారు. ఈ సినిమా కూడా హోల్డ్ లోనే ఉంది. దీంతో ఇప్పుడు ఓ కొత్త ద‌ర్శ‌కుడితో త‌న నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు రానా సిద్ద‌మ‌య్యాడ‌ట. ఈ సినిమాను ‘బాహుబ‌లి’ నిర్మాత‌లు ఆర్కా మీడియా వ‌ర్క్స్ ప్రొడ్యూస్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

కాగా, ఈ సినిమాలో ‘కేజీఎఫ్’ హీరోయిన్ శ్రీనిధిని తీసుకునేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ కాంబినేష‌న్ తెలుగు ఆడియెన్స్ కు రిఫ్రెషింగ్ గా క‌నిపిస్తుంద‌ని వారు భావిస్తున్నార‌ట‌. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ త్వ‌ర‌లోనే రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు