“సింగర్‌”గా మారబోతున్న దగ్గుబాటి రానా..!

Published on Sep 26, 2021 3:00 am IST


దగ్గుబాటి రానా-సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరక్క్కించిన చితం “విరాటపర్వం”. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. అయితే ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న తాజా వార్తల ప్రకారం రానా త్వరలో ఈ సినిమాలో ఓ ఆలోచనాత్మక పాటను పాడబోతున్నాడని తెలుస్తుంది.

అంతేకాదు వచ్చే వారం పాట రికార్డ్ చేయబడుతుందని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందివ్వగా సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా సినిమాస్ వారు నిర్మాణం వహించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం “భీమ్లా నాయక్‌”లోని డేనియల్ శేఖర్‌గా రానా కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :