ఆ ముగ్గురికి వెల్ కమ్ చెప్పిన రానా దగ్గుపాటి!

Published on Aug 17, 2021 6:01 pm IST

జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ బోర్డ్ లోకి సరికొత్తగా ముగ్గురు రావడం పట్ల టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా దగ్గుపాటి వెల్ కమ్ చెప్పారు. బాలివుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా చైర్ పర్సన్ గా ఎంపిక అవ్వడం తో పాటుగా, రైటర్, ఫిలిం మేకర్ అయిన అంజలి మీనన్ మరియు ఫిలిం మేకర్ శివి దుంగర్పుర్ లు జియో మామీ బోర్డ్ సభ్యులు గా చేరడం జరిగింది. వీరి చేరిక తో థ్రిల్ గా ఉన్నట్లు రానా దగ్గుపాటి చెప్పుకొచ్చారు.

ప్రియాంక చోప్రా, అంజలి మీనన్ మరియు శివి దుంగర్పుర్ లు మామి లో బాధ్యతలు స్వీకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :