ఓటీటీలోకి రానా దగ్గుబాటి సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Published on Feb 4, 2022 3:00 am IST

రానా దగ్గుబాటి హీరోగా, సత్య శివ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం ‘1945’. జనవరి 7వ తేదిన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన మేరకు ఆకట్టుకోలేపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ఫిబ్రవరి 7, 2022న సన్‌నెక్స్ట్‌లో ప్రీమియర్ కానుంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రానా సరసన హీరోయిన్‌గా రెజీనా కసాండ్రా కథానాయికగా నటించింది. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అయితే పీరియాడికల్ డ్రామాని చూడాలనుకునే వారు వచ్చే వారం నుండి ఈ చిత్రాన్ని సన్‌నెక్స్ట్ ద్వారా చూసేయండి.

సంబంధిత సమాచారం :