రానా దగ్గుపాటి “విరాట పర్వం” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on May 6, 2022 5:24 pm IST


హాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం విరాట పర్వం. ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలలో హీరో హీరోయిన్ లు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. విరాట పర్వం చిత్రంను జూలై 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

విడుదల చేసిన సరికొత్త పోస్టర్‌లో రానా మరియు సాయి పల్లవి ఇద్దరూ అరణ్యంలోకి చేతులు పట్టుకుని పరిగెత్తుతున్నట్లు కనిపిస్తోంది. చేతిలో తుపాకీతో రానా దూకుడుగా కనిపిస్తుండగా, సాయి పల్లవి మాత్రం భయానకంగా కనిపిస్తోంది. ఈ సినిమా టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. త్వరలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను షురూ చేయనున్నట్లు తెలుస్తోంది.

1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొందింది ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రావన్న పాత్రను పోషించాడు. సాయి పల్లవి అతని అభిమాని వెన్నెల పాత్రలో కనిపించనుంది. విరాట పర్వం యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథ అని తెలుస్తోంది. డి సురేష్ బాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి, నందిత దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, సాయి చంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవి ప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు వేణు ఊడుగుల, నిర్మాత సుధాకర్ చెరుకూరి, బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, DOP డాని శాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర, సంగీతం సురేష్ బొబ్బిలి, విన్యాసాలు స్టీఫెన్ రిచర్డ్, పీటర్ హెయిన్, కొరియోగ్రఫీ రాజు సుందరం, PRO వంశీ, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ చాగంటి, పబ్లిసిటీ డిజైన్ ధని ఏలే లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :