ఆకట్టుకుంటున్న రానా దగ్గుపాటి “విరాట పర్వం” ట్రైలర్!

Published on Jun 5, 2022 7:45 pm IST

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి తన కొత్త సినిమా విరాట పర్వం చిత్రంతో జూన్ 17, 2022 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా కర్నూలులో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ ఈ విరాట పర్వం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ట్రైలర్ చూస్తుంటే, రవన్న రచించిన అరణ్య అనే పుస్తకాన్ని చదివిన తర్వాత వెన్నెల (సాయి పల్లవి) రవన్న (రానా దగ్గుబాటి) అనే నక్సలైట్‌తో ప్రేమలో పడినట్లు ధృవీకరించబడింది. ఆమె చివరకు రవన్నను కలుసుకుని అతని పట్ల తనకున్న ప్రేమను తెలియజేస్తుంది. ప్రజల కోసం పోరాడటానికి ఇష్టపడే రవన్న ఆమెను తిరస్కరించాడు. తరువాత ఏం జరిగింది? రవన్న వెన్నెలను ప్రేమిస్తాడా? ఈ సమాధానాలు ప్రధాన చిత్రంలో తెలియనున్నాయి.

బాగా కట్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డాని సలో, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ సినిమాకు అసెట్. ఈ చిత్రంలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :