బాలయ్యతో రానా.. ప్రోమో అదిరింది !

Published on Jan 2, 2022 11:16 pm IST

బాలయ్య ‘అన్‌ స్టాపబుల్’ షోకి రానా దగ్గుబాటి గెస్ట్ గా వచ్చారు. అయితే, ఈ షోలో రానా బాలయ్యను ఒక ప్రశ్న అడుగుతూ వసుంధరగారికి మీరు ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పారా ? అని అడిగాడు. రానా అడిగిన మేరకు బాలయ్య కూడా తన సతీమణికి ఫోన్ చేసి.. ‘వసూ.. ఐ లవ్‌ యు’ అని ఫోన్ చేశారు. అయితే, బాలయ్యకి సమాధానంగా వసుంధర గారు కూడా స్పందిస్తూ.. ‘నాకు తెలుసు మీరెప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారు’ అని సమాధానమిచ్చారు.

కాగా రానా అతిథిగా విచ్చేసిన ఈ ఎపిసోడ్ లో రానాతో బాలయ్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రానా కూడా బాలకృష్ణ నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయడం ఆకట్టుకుంది. బాలయ్య కూడా రానాని ఓ ఆట ఆడుకున్నారు. ‘అప్పట్లో పూలరంగడులా తిరిగేవాడివి’ అంటూ అంటూ వినోదం పంచారు.

సంబంధిత సమాచారం :