ఆ వార్తలపై రానా క్లారిటీ.. వైరల్ అవుతున్న ట్వీట్..!

Published on Nov 3, 2021 2:07 am IST

దగ్గుబాటి రానా-సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన “విరాటపర్వం”పై వచ్చిన ఓ రూమర్‌పై రానా క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం ఇప్పటివరకు పనిచేసిన సంగీత దర్శకుడు సురేశ్‌ బొబ్బిలి తప్పుకున్నారని, దర్శకుడికి అతడికి మధ్య తల్లెత్తిన విబేధాలే ఇందుకు కారణమని, ఆయన స్థానంలోకి సామ్‌ సీఎస్‌ వచ్చారని ఓ వెబ్‌సైట్ కథనం రాసుకొచ్చింది.

అయితే దీనికి ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చిన రానా ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోగా, ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కామ్రేడ్‌ రవన్నగా రానా నటిస్తున్నారు. ప్రియమణి, నవీన్‌ చంద్ర, నందితా దాస్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :