ఈ చిన్న సినిమా ‘రానా’కి గౌరవం తెస్తుందట !

వెంకట్ మహా దర్శకత్వంలో రూపొందిన ‘కేరాఫ్ కంచరపాలెం’ అనే చిన్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై ‘రానా దగ్గుబాటి’ సమర్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల తేదీని ఖారారు చేసుకుంది. ఈ చిత్ర సమర్పకుడు రానా తన ట్విట్టర్ ద్వారా సెప్టెంబర్ 7న ‘కేరాఫ్ కంచరపాలెం’ విడుదల అవబోతుందని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రం పట్ల ఆయన చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఈ చిన్న చిత్రం తనకు గౌరవం తెస్తుందని ఆయన భావిస్తున్నారు.

కాగా ఈ సినిమా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించింది. విశాఖపట్నంలోని కంచరపాలెం అనే ప్రాంత నేపథ్యంలో జరిగే ఈ సినిమాలో ఆక్కడి నలుగురి వ్యక్తులకు సంబందించిన కథల్ని చెప్పడం జరుగుతుందట. వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే ఈ కథ ప్రేక్షకులకు చాలా ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది.

The film I proudly present #CareofKancharapalem releases worldwide on September 7th!! More on the film this weekend!! Stay tuned!! pic.twitter.com/wqgzV2qamD

— Rana Daggubati (@RanaDaggubati) August 8, 2018