విశేషంగా అలరిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్ !


దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. సీనియర్ డైరెక్టర్ తేజ చాలా రోజుల తర్వాత చేస్తున్న సినిమా కావడం అలాగే ‘బాహుబలి-2’ విజయం తర్వాత రానా పూర్తి స్థాయి కథా నాయకుడిగా నటించిన ప్రాజెక్ట్ కావడంతో దీనిపై మంచి క్రేజ్ ఉంది. ఇకపొతే ఈరోజు ఉదయం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఆసక్తికరమైన ఆ ట్రైలర్ చూస్తే సినిమాపై ఉన్న అంచనాల్ని రెట్టింపు చేసేదిగా ఉంది.

ఆరంభం నుండి చివరి వరకు ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ సినిమాలో పొలిటికల్ డ్రామా ఏ స్థాయిలో ఉందో చెబుతోంది. అంతేగాక రానా చెప్పిన డైలాగ్స్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక సాధారణ యువకడైన జోగేంద్ర తన రాజకీయ చతురతతో ముఖ్యమంత్రి స్థాయికి ఎలా చేరుకున్నాడు అనే స్టోరీ లైన్ తో రూపొందిన ఈ సినిమాను సురేష్ బాబు, భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు నిర్మించగా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి