మరోసారి ఇంప్రెస్ చేసిన రానా !

విలక్షణ నటుడు రానా ఈసారి కూడా తన భిన్నమైన అభిరుచితో ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేశారు. ఆయన చేస్తున్న కొత్త ప్రాజెక్ట్స్ లో ఒకటైన ‘హాతి మేరే సాతి’ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను కొత్త సంవత్సరం సందర్బంగా రిలీజ్ చేశారాయన. అందులో రానా లుక్ పూర్తిగా భిన్నంగా అస్సలు ఊహించని విధంగా ఉంది.

లుక్ చూసిన ప్రతి ఒక్కరు ఈసారి కూడా రానా కొత్త ప్రయత్నంతో రాబోతున్నారని అభిప్రాయపడుతున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదలకానున్న ఈ చిత్రాన్ని తమిల్ దర్శకుడు ప్రభు సాలమన్ డైరెక్ట్ చేయనున్నారు. తెలుగులో ‘అడవి రాముడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్న ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ను త్వరలోనే థాయ్ ల్యాండ్ లో మొదలుపెట్టనున్నారు.