వారిద్దరిలో “మానాడు” హీరో ఎవరు ?

Published on Feb 15, 2022 8:00 am IST


తమిళ ఆడియన్స్ లో భారీ రెస్పాన్స్ తో బాగా ఆకట్టుకున్న చిత్రం “మానాడు”. శింబు – ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హిట్ ను సాధించింది. అయితే ఈ సినిమాలో హీరోగా అక్కినేని నాగ చైత‌న్య నటించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో రానా హీరోగా నటించబోతున్నాడని కొత్తగా రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

కాగా శింబు కెరీర్ లోనే మంచి కమ్ బ్యాక్ సినిమాగా ఈ సినిమా నిలిచింది. మరి త‌మిళంలో మంచి హిట్ గా నిలిచిన ఈ మానాడు సినిమా తెలుగు రీమేక్ రైట్స్ కోసం గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడ‌క్షన్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివ‌రికి సురేష్ ప్రొడ‌క్షన్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకుంది. కాబట్టి.. రానాతో లేదా చైతుతోనే ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ రీమేక్ చెయ్యడం ఖాయం.

ఇక తమిళంలో ఈ మానాడు సినిమాను తెర‌కెక్కించిన వెంక‌ట్ ప్ర‌భునే తెలుగులో కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు అని తెలుస్తోంది. అయితే, ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :