సంజయ్ రావ్ “స్లమ్ డాగ్ హజ్బెండ్” మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన రానా.!

Published on May 29, 2022 9:00 am IST


యంగ్ హీరో సంజయ్ రావు హీరోగా మైక్ మూవీస్ నిర్మిస్తున్న లేటెస్ట్ కామికల్ ఎంటర్ టైనర్ సినిమా “స్లమ్ డాగ్ హజ్బెండ్”. ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ,సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రెజెంట్ రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. తాజాగా “స్లమ్ డాగ్ హజ్బెండ్” మోషన్ పోస్టర్ ను స్టార్ హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు. మోషన్ పోస్టర్ హ్యూమరస్ గా ఉందన్న రానా…చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. “స్లమ్ డాగ్ హజ్బెండ్” మోషన్ పోస్టర్ ఎలా ఉందో చూస్తే…”వివాహాల్లో మనం పాటిస్తున్న కొన్ని మూఢ నమ్మకాలను వినోదాత్మకంగా చూపిస్తూ దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఐశ్వర్యరాయ్ కి చెట్టుతో పెళ్లి చేయడం, కొందరు వరులకు జంతువులతో వివాహాలు జరిపిన న్యూస్ క్లిప్పింగ్స్, రాశుల ఫొటోలు మోషన్ పోస్టర్ లో కనిపించాయి. ఈ చిత్రంలో హీరోకు కూడా ఇలాగే మూఢ నమ్మకాలతో ఓ కుక్కతో పెళ్లి జరిపిస్తారు. ఆ కుక్కపై హోలీ రోజు రంగు చల్లితే అర్జున్ రెడ్డి స్టైల్లో కోపంగా ఎవడ్రా నా కుక్కమీద రంగు పోసింది..అనడం నవ్వించింది. మిమ్మల్ని ఈ పెళ్లికి సంతోషంగా ఆహ్వానిస్తున్నాం” అంటూ మోషన్ పోస్టర్ పూర్తయింది. పార్శీగుట్టలో లచ్చిగాని పెళ్లిసందడి మాములుగా ఉండదు అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తున్న పాట సినిమా ఎంత మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందో తెలియజేస్తోంది.

ఇక ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్,సప్తగిరి, ఫిష్ వెంకట్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ – వైష్ణవ్ వాసు, సినిమాటోగ్రఫీ – శ్రీనివాస్ జె రెడ్డి, సంగీతం – భీమ్స్ సిసిరోలియో, సాహిత్యం – కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, శ్రీనివాస్, పూర్ణా చారి, పీఆర్వో – జీఎస్కే మీడియా, లైన్ ప్రొడ్యూసర్ – రమేష్ కైగురి, బిజినెస్ హెడ్ : కొ వె ర, సహ నిర్మాతలు – చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల, ప్రకాష్ జిర్ర, రవళి గణేష్, సోహంరెడ్డి మన్నెం, నిర్మాతలు – అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రచన దర్శకత్వం – డాక్టర్ ఏఆర్ శ్రీధర్ లు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :