‘రానా నాయుడు’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Feb 15, 2023 8:03 pm IST

రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ వెబ్ సిరీస్ రానా నాయుడు. తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ పై దగ్గుబాటి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

అమెరికన్ టివి సిరీస్ రే డొనోవన్ ఆధారంగా రూపొదుతున్న ఈ వెబ్ సిరీస్ ని ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ వారు ప్రసారం చేయనున్నారు. కాగా రానా నాయుడు సిరీస్ మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ కి అందుబాటులోకి రానుంది. ఇక ఈ సిరీస్ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం :